TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాకు మంత్రి పదవి కంటే..వాళ్లే ముఖ్యం రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Published on: Wed Jul 23, 2025 3:28PM

 

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి ఇస్తామన్నారని తెలిపారు. అయితే మంత్రి పదవి అక్కర్లేదు.. నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమని రాజగోపాల్ రెడ్డి  అన్నారు. అందుకే ఇక్కడి నుంచే పోటీ చేశానని వెల్లడించారు. 2018 ఎన్నికల్లో నల్గొండలో అందరూ ఓడిపోతే, కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఒక్కడినే గెలిచానన్నారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించింది బీఆర్‌ఎస్ కాదు కమ్యూనిస్టులే అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.  రీసెంట్‌గా సీఎం రేవంత్ నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని జటప్రోలులో మాట్లాడుతు పాలమూరు బిడ్డనైన తాను పదేండ్ల వరకు ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ కామెంట్స్‌పై  మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అలా ప్రకటించుకోవడం కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సహించరని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఇది మరువకముందే మరోసారి మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రాష్ట్ర రాజకీయల్లో హాట్ టాఫిక్‌గా మారింది