జగన్ మీడియా అసత్య కథనాలపై చింతమనేని నిరసన
Published on: Wed Apr 23, 2025 4:43PM

జగన్ మీడియా అసత్య కథనాలపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఏలూరు జిల్లా మీడియా కార్యాలయంలో వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆఫీస్ ముందు టెంట్ వేసుకోని నిరసన వ్యక్తం చేశారు. రక్త తర్పణం’ అంటూ బ్లూ మీడియా ప్రచురించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా రాస్తారంటూ రిపోర్టర్‌పై చింతమనేని ఫైర్‌య్యారు. సదరు వ్యక్తి బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తనపై తప్పుడు వార్తలు రాసినందుకు నిలదీయడానికి మాత్రమే వచ్చానని చింతమనేని వివరణ ఇచ్చారు. వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని, తనకి సంబంధం లేకపోయినా తన పేరుని అందులో చేర్చారని చింతమనేని వాపోయారు. ఈ విషయం తెలుసుకోవటాని తాను ఆఫీస్ కి వచ్చాని ఆయన అన్నారు. అంతేకానీ తాను అక్కడ ఎలాంటి గొడవ చేయలేదని చింతమనేని క్లారీటీ ఇచ్చారు


