TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిమ్స్‌ ఆస్పత్రిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి

Published on: Tue Sep 16, 2014 12:50PM

 

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రస్తుతం నిమ్స్‌లో వున్నారు. వనపర్తి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను పోలీసులు నిమ్స్‌కి తరలించారు. దీక్ష విరమించాలని పార్టీ నేతలతో పాటు, పోలీసులు విజ్ఞప్తి చేసినా చిన్నారెడ్డి పట్టు వీడలేదు. దీంతో పోలీసులు ఆయనపై 309 సెక్షన్ కింద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. చిన్నారెడ్డి దీక్ష ఆపకుండా నిమ్స్‌లో కూడా నిరాహారదీక్ష కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.