TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కరీంనగర్ లోనే బట్టలు ఊడదీసి కొడతాం! సంజయ్ కి సుమన్ వార్నింగ్

Published on: Thu Jan 7, 2021 11:43AM

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ  మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆరోపణలు, విమర్శలు చేయడంలో హద్దులు  దాటుతున్నారు ఇరు పార్టీల నేతలు. కేసీఆర్ టార్గెట్ గా దూకుడుగా వెళుతున్న బీజేపీ చీఫ్ సంజయ్ కి అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు గులాబీ లీడర్లు. వరంగల్ పర్యటనలో కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేసిన బండి సంజయ్ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్  ఫైరయ్యారు. కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సంజయ్ కి నాలుక కోస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ని విమర్శిస్తే ఆయన సొంత గడ్డ కరీంనగర్ లోనే బండి సంజయ్ ని బట్టలు ఊడదీసి కొడతామన్నారు బాల్క సుమన్.

కేసీఆర్ చేసిన ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందని... బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడని బాల్క సుమన్ చెప్పారు. కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులపై మహారాష్ట్రలోని శివసేన తరహాలో దాడి చేయాలని అన్నారు.  గుడులు, బడులు, ఇండియా, పాకిస్థాన్ అంటూ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంటే... రైతులను నట్టేట ముంచే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని బాల్క సుమన్ విమర్శించారు. ఢిల్లీలో చలికి వణుకుతూ రైతులు ఆందోళన చేస్తుంటే... చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు బాల్క సుమన్.