బాలకృష్ణ కాన్వాయ్ కు ప్రమాదం..


అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. హిందూపురం నుంచి బెంగళూరు వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి వద్దకు రాగానే కాన్వాయ్ లోని ఒక వాహనం బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ఆ వాహనంలో ఉన్న పార్టీ కార్యకర్తలందరూ సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.