ఇస్రో చైర్మన్‌కు సమైక్య సెగ

Publish Date:Nov 5, 2013

Advertisement

 

భారత అంతరిక్ష పరిశోదన సంస్థ పీఎస్‌ఎల్‌వి సీ 25 ప్రయోగం విజయవంతం అయిందన్న ఆనందంలో ఉండగా సమైక్య వాదులు మరోసారి తమ వాదనను అరుణగ్రహానికి వినిపించేలా నినదించారు. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్‌ విలేఖరులతో మాట్లాడుతున్న సమయంలో అక్కడి వచ్చిన విలేఖరులు సమైక్యాంద్రకు మద్దతుగా నినాదాలు చేశారు.

 

ఈ పరిణామంలో ఒక్కసారిగా షాక్‌ గురైన రాధాకృష్ణ కాసేపు ఆగి తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రి వి నారాయణ స్వామికి తెలిపేందుకే సమైక్య నినాదాలు చేసినట్టుగా జర్నలిస్టులు తెలిపారు. నారాయణ స్వామి ప్రస్థుతం రాష్ట్రవిభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులు బృందంలో సభ్యుడిగా ఉన్నారు.

 

By
en-us Political News