TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్ర‌పంచ సుంద‌రిగా క‌రోలినా.. జిల్ జిల్ జిగా...

Published on: Thu Mar 17, 2022 11:57AM

కొవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డిన మిస్ వ‌రల్డ్ 2021 పోటీలు ప్యూర్టో రికోలో అట్ట‌హాసంగా జ‌రిగాయి. పోలాండ్ అందాల‌ భామ‌.. కరోలినా బిలావ్స్కా ప్ర‌పంచ సుంద‌రిగా ఎంపిక‌య్యారు. త‌ల‌పై అందాల రాణి కిరీటంతో మురిసిపోయారు. అమెరికాకు చెందిన శ్రీ సైనీ ఫ‌స్ట్‌ రన్నరప్ కాగా, కోస్ట్‌ డి ఐవరీకి చెందిన ఒలివియా యాస్ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. 

క‌రోలినా ప్ర‌ముఖ మోడ‌ల్‌. మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. పీహెచ్‌డీ కూడా చేయాల‌ని అనుకుంటోంది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడటం హాబీ. మోటివేషనల్ స్పీకర్ కావాలనేది ఆమె గోల్‌. 

"మిస్ వ‌ర‌ల్డ్‌గా నా పేరు విన్నప్పుడు షాక్ అయ్యాను, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించడం నాకు గౌరవంగా ఉంది. ప్యూర్టో రికోలోని ఈ అద్భుతమైన ఘట్టాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను." అని పోలండ్ బ్యూటీ క్వీన్ కరోలినా స్పందించింది. 

ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లోని కోకా-కోలా మ్యూజిక్ హాల్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ప్రసారమ‌య్యాయి.