తుపాకీ మిస్‌ఫైర్: కానిస్టేబుల్ మృతి
Published on: Sat Jul 12, 2014 12:19PM

ఓ కానిస్టేబుల్ చేతిలోని తుపాకి మిస్ ఫైర్ కావడంతో ఆ కానిస్టేబుల్ మరణించిన సంఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగింది. కలెక్టరేట్ ట్రెజరీ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న రమేష్‌రెడ్డి అనే కానిస్టేబుల్ చేతిలో వున్న తుపాకీ ప్రమాదవశాత్తూ పేలింది. దాంతో బుల్లెట్ ఆ కానిస్టేబుల్ ఛాతీలోంచి దూసుకెళ్లింది. దీంతో రమేష్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరణించిన కానిస్టేబుల్ రమేష్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.


