TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరోనా సోకిన పిల్లలకు మరో వింతవ్యాధి ? 

Published on: Tue Jun 1, 2021 1:45PM

కరోనా ఒక వైపు దేశం విలయ తాండవం చేస్తుంది. మరణాలు ఒక ఒక రేంజు లో చనిపోతున్నారు. రోజు ఒకటి కాదు, రెండు కాదు రోజు వేల సంఖ్యలో మరణాలు సంవిస్తున్నాయి. సెకండ్ ఒకవైపు అయితే కొత్తగా దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయబ్రాంతులకు గురిచేస్తోంది.. ఈ బ్లాక్ ఫంగస్  వల్ల చాలా మంది బాధపడుతున్నారు. కొంత మంది చనిపోతున్నారు. అయితే ఈ రెండు వ్యాధులు ఇప్పటివరకు యువకుల పై, పెద్ద వారిపై ప్రభావం చూపించింది. చాలా మంది ఆ మహమ్మారి కాటుకు బలైయింది.. అయితే ఈ రెండు మహామారిలు అంతం కాకముందే ఇప్పుడు మరో వ్యాధి వస్తోంది. కొత్త వ్యాధి విరుచుకుపడుతుంది.ఈ వ్యాధి అలాంటి ఇల్లాంటి వ్యాధి కాదు అది డైరెక్టుగా చిన్న పిల్లపైనే దాని ప్రభావం చూపుతుంది.  దీని పేరు MIS-C. అనగా మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తోందని స్పష్టమైంది. బ్లాక్ ఫంగస్ కోవిడ్ -19 తో సంబంధం కలిగి ఉన్నట్లే MIS-C కూడా కరోనా వైరస్‌తో సంబంధం ఉన్న వ్యాధి. ఈ వ్యాధి ఉత్తర భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కనిపిస్తుంది. చాలామంది పిల్లలు దీని బారిన పడ్డారు. కుటుంబంలో ఎవరైనా కోవిడ్ -19 రోగి లేదా కోలుకున్నట్లయితే పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలలో ఏదైనా అసాధారణ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

MIS-C వ్యాధి అంటే ఏమిటి

ఈ వ్యాధి కోవిడ్ -19 తో సంబంధం కలిగి ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా కొవిడ్ బారిన పడితే వారిద్వారా పిల్లలకు సంభవిస్తుంది. కోవిడ్ రోగి కోలుకున్నా, పిల్లలు అతనితో సంబంధం కలిగి ఉంటే అప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. అయినప్పటికీ కరోనా బారిన పడిన పిల్లలలో 0.14 శాతం మంది మాత్రమే MIS-C కి గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సంఖ్య పెరుగుతుంది. పిల్లలలో మీరు నిరంతర జ్వరం, చర్మ మచ్చలు లేదా దద్దుర్లు, అలసట, ఎర్రటి కళ్ళు, విరేచనాలు వంటి సమస్యలను చూసినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ వ్యాధిని డెంగ్యూ లేదా టైఫాయిడ్ లాగా చికిత్స చేయలేమని వైద్యులు చెబుతున్నారు. దీనికి చికిత్స పూర్తి భిన్నంగా ఉంటుందని పిల్లలను వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం అవసరమని సూచిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు ఏమిటి

ఈ వ్యాధిలో పిల్లల అనేక అవయవాలలో వాపు ఉంటుంది. మెదడు, గుండె, రక్త నాళాలు, కడుపు, మూత్రపిండాలు లేదా చర్మం వాపు ఉంటుంది. ప్రారంభంలో జ్వరం ఉంటుంది. తరువాత వాపు మొదలవుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. పిల్లలకి 100 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జ్వరం, చర్మం దద్దుర్లు, ముందరి ఉద్గారాలు, గొంతు లేదా వాపు, ఎర్రటి కళ్ళు, నాలుకపై ఎర్రటి మచ్చలు, కడుపు నొప్పి, విరేచనాలు, అలసట దాని ప్రధాన లక్షణాలు. కష్ట సమయాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఛాతీ నొప్పి, పసుపు లేదా నీలం కళ్ళు, ఇవి తీవ్రమైన లక్షణాలు. వీలైనంత త్వరగా పిల్లవాడిని అత్యవసర సంరక్షణలో చేర్పించాలి.