TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యూవీ రికార్డ్ రిపీట్..ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు..

Published on: Fri Mar 10, 2017 5:04PM


టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో యువరాజ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన రికార్డ్ ను మరోసారి గుర్తు చేశాడు పాకిస్థాన్‌ ఆటగాడు మిస్బా ఉల్‌ హక్‌. హాంకాంగ్‌లో డీటీసీ టీ20 బ్లిట్జ్‌ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా.. హాంగ్‌ హమ్‌ జేడీ జాగ్వార్స్‌-హెచ్‌కేఐ యునైటెడ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. యునైటెడ్‌ జట్టు 20 ఓవర్లలో 216 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ కు దిగిన హెచ్‌కేఐ యునైటెడ్‌ ఆటగాడైన మిస్బా వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. దీంతో కేవలం 37 బంతుల్లో 82 పరుగులు చేసిన మిస్బా నాటౌట్‌గా నిలిచాడు.