TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

TRS లీడర్ ఇంట్లో రేప్? ఓ మైనర్ బాలికకు గర్భం.. 

Published on: Thu May 27, 2021 3:55PM

అతను టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రనిధి. మూర్ఖుడిగా ప్రవర్థించాడు. మానవత్వం మరిచాడు. తానూ ప్రజా ప్రతినిధి అని ఏం చేసిన చెల్లుతుందని అనుకున్నాడు . ఆ అహంకారంతోనే వ్యవహరించాడు. ప్రజలకు ఆదర్శనంగా ఉండాల్సిన నాయకుడు పరమనీచుడు అయ్యాడు. మైనర్ బాలికను తన ఇంట్లో పనిచేయిస్తున్నాడు. బాలకార్మిక వ్యవస్థను ఒక రకంగా కొమ్ము కాస్తున్నట్లే చేశాడు. ఇది అంత ఒక ఎత్తు అయితే. 

అది జగిత్యాల జిల్లా. రాయికల్ మండల కేంద్రం. అతను టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధి. అతని ఇంట్లో ఒక  బాలిక పనిచేస్తుంది. ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు. ఆ బాలిక  కుటుంబం సదరు ప్రజా ప్రతినిధి ఇంటి పక్కనే చాలా ఏళ్లుగా నివాసం ఉంటోంది. మొదట బాలిక అక్క అదే ఇంట్లో ఇంటి పని చేసేది. ఆమె తర్వాత ఆమె చెల్లెలు ఆ పని చేస్తోంది. అయితే అమ్మాయి  గర్భం దాల్చింది. ఆ అమ్మాయి గర్భం  దాల్చడం కలకలం రేపుతోంది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో  వైరల్ అవ్వడం తో జగిత్యాల జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారులు సదరు ప్రజాప్రతినిధి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. వెంటనే బాలికను రెస్క్యూ చేశారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కుటుంబం సదరు ప్రజా ప్రతినిధి ఇంటి పక్కనే చాలా ఏళ్లుగా నివాసం ఉంటోంది. మొదట బాలిక అక్క అదే ఇంట్లో ఇంటి పని చేసేది. ఆమె తర్వాత ఆమె చెల్లెలు ఆ పని చేస్తోంది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడం నేరం. అంతేకాక, ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంట్లో దీనికి ఎవరు కారణం అయి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం డీసీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడెవరో కనిపెట్టే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్ప్రజాప్రతినిధితో పాటు అదే ఇంట్లో ఉంటున్న డ్రైవర్పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు వివరాలను బయటకు చెప్పడం లేదు. అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం చైల్డ్ప్రొటెక్షన్ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఉన్న బాలికను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉంచి ట్రీట్‌మెంట్ఇప్పిస్తున్నారు. పోలీసులు పోక్సో కింద కేసు ఫైల్చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయమై డీఎస్పీ వెంకట రమణను వివరణ కోరగా, ఇది సున్నితమైన కేసు అయినందున ఇప్పుడే వివరాలు బయటకు చెప్పలేమన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరా తీశారు.