TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గొంతు కోసి బాలిక హత్య.. ప్రేమోన్మాది ఘాతుకం

Published on: Fri Apr 10, 2026 3:51PM

గొంతు కోసి బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాది ఉదంతం కడప జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం  ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఆవుల వెంకటేష్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన అనే విద్యార్థినితో తనకు ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమించానంటూ ఆమెను వేధించసాగాడు. అయితే ఆమె నిరాకరిచడంతో వెంకటేష్ ఉన్నాదిగా మారిపోయాడు.  శనివారం కీర్తనపై కత్తితో దాడి చేశాడు.

విచక్షణా రహితంగా పోడిచి, ఆమె గొంతు కోసి హత్య చేశాడు.  ప్రేమోన్మాది వెంకటేష్ దాడిలో తీవ్రంగా గాయపడిన కీర్తనను స్థానికులు హుటాహుటిన   కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే..పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు ఆవుల వెంకటేష్ ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.  మైనర్ బాలిక హత్యతో ఖాజీపేట మండలంలో  విషాదం అలుముకుంది.