మరో అత్యాచారకాండ.... ఈసారి బలైన 10వ తరగతి విద్యార్థిని

 

మహిళల మీద అరాచకాల పర్వం కొనసాగుతూ ఉంది. తొమ్మిది నెలల పసిపాప దగ్గరనుండి తొంభై ఏళ్ల ముసలవ్వదాకా ఎవరినీ కామంధులు విడిచిపెట్టడం లేదు. హన్మకొండలో తొమ్మిది నెలల పసి పాప మీద జరిగిన రేప్ ఘటన మరువక ముందే ఎపీలోని ఒంగోలులో మైనర్ బాలిక మీద జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఈ ఘటనలు ఇంకా మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈసారి మాత్రం మన పొరుగున ఉన్న ఒడిసా రాష్ట్రంలో. పదో తరగతి చదువుతున్న ఒక బాలికని గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనంగా మారింది. ఒడిశాలోని కేంఝర్‌ జిల్లా జోడాలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక మొన్న బంధువుల ఇంటికి వెళ్ళింది. వారింట సమయం గడిపి రాత్రి సమయంలో ఇంటికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఈమె ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఐదుగురు యువకులు ఆమెను అడ్డగించి, భయపెట్టి ఆమెని ఒక నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అరిస్తే చంపేస్తామని బెదిరించి బాలికపై అందరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 

వారి ధాటికి తట్టుకోలేని ఆ బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆ యువకులు ఆమెను ఓ మైదానంలో పడేసి వెళ్లిపోయారు. ఇక నిన్న తెల్లవారుఝామున  తీవ్ర గాయాలతో పడివున్న బాలికను స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక చెప్పిన వివరాల ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే రేప్ కేసుల్లో ప్రస్తుతం ఉన్న శిక్ష సరిపోవడం లేదని, ఈ శిక్షాస్మృతిని మార్చాలనే డిమాండ్ మొదలయ్యింది. రేప్ చేసిన వారిని చంపేయడం లేదా వారి అంగ చేధన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.