జేపీకి చైర్మన్ పదవి
Published on: Mon Aug 6, 2018 1:25PM
.jpg)
గుంటూరుకు చెందిన వల్లూరు జయప్రకాష్ నారాయణను.. ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ముద్దుగా జేపీ అని పిలుచుకుంటూ ఉంటారు.. జేపీ దశాబ్దకాలంగా బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.. అధినాయకత్వం ఎప్పుడు ఏ బాధ్యత అప్పగించినా జేపీ నిబద్దతో, నిజాయితీగా పనిచేస్తారు.. కర్ణాటక, యూపీ, బీహార్ ఇలా పలు ఎన్నికల్లో చురుకుగా పాల్గొన్న జేపీ, ఆయన పాత్రను సమర్దవంతంగా నిర్వర్తించారు.. ఈ నిజాయితీ, సమర్ధతే ఆయనను అధినాయకత్వానికి దగ్గర చేసాయి.. జేపీకి, బీజేపీ మరియు ఆరెస్సెస్ తో సత్సంబంధాలు ఉన్నాయి.

అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆయనకు మరో బాధ్యత అప్పగించింది.. అదే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కమిటీ చైర్మన్ పదవి.. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్, జేపీని చైర్మన్ పదవికి ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. దీనిపై జేపీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు తెలుగు వన్ డైరెక్టర్ అయిన జేపీకి 'ఎమ్.ఓ.ఎస్' హోదా కలిగిన పదవి రావడంపట్ల.. తెలుగువన్ యాజమాన్యంతో పాటు, ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్న జేపీ, తన పదవికి మరింత వన్నె తెచ్చి.. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగువన్ జేపీ గారికి శుభాకాంక్షలు తెలుపుతుంది.
.jpg)


