TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ సమగ్ర సర్వే... కేంద్ర హోంశాఖ ఆరా...

Published on: Wed Aug 13, 2014 2:20PM

 

ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. తాను సర్వే వివరాలు తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. ఈ సర్వేపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేశారు. సర్వే రోజున అందరూ తప్పనిసరిగా ఇంటి వద్దే ఉండాలని చెప్పడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్రానికి ఎంపీలు తెలిపారు. దీంతో కేంద్ర హోంశాఖ సర్వే వివరాలు కోరింది. ఇప్పటికే అనేక అంశాలతో కేంద్రంతో విభేదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తన ప్రతిస్పందనను ఎలా తెలియజేస్తుందో చూడాలి.