రాష్ట్రాన్ని లూటీ చేశారన్న చంద్రబాబు
Published on: Wed Oct 17, 2012 11:39AM
.png)
మంత్రులంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్నారని, అవినీతి, ల్యాండ్ మాఫియా, రౌడీయిజం, గుండా యిజం పెరిగిపోయారని చంద్రబాబునాయుడు తనపాద యాత్రలో పేర్కోన్నారు. పన్నుల మీద పన్నులు వేసి సామాన్య మద్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన ఆరోపించారు. అసమర్ద రాకస ప్రభుత్వం మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని ధరలను అదుపు చేయవలసిని నేతలంతా పదవులను కాపాడుకునేందుకు ఢిల్లీలో మకాంపెట్టారని తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు అన్నారు. వర్షాకాలంలో కూడా కరెంటు కోతలతో జనాలను చీకట్లో ఉంచితే రానున్న ఎండాకాలంలో పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికార ప్రభుత్వం పేద, బడుగు, బలహీన, ముస్లిం , మైనారిటీ, చేనేత వర్గాలనే కాకుండా రైతులకు కూడా తీరని అన్యాయం జరిగిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అసంబద్ద, దధ్దమ్మ రాక్షస ప్రభుత్వం అని చంద్రబాబు దుయ్యబట్టారు.


