TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కులం ఆధారంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు : మంత్రి వివేక్‌

Published on: Sun Oct 12, 2025 6:42PM

 

మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేస్తున్నా నాపై కుట్రలు చేస్తునారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మాలల ఐక్య సదస్సలో మంత్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారన్నారు. నేను మాల జాతికి చెందిన వాడిని అని అడ్లూరి లక్ష్మణ్ నన్ను విమర్శిస్తున్నాడు. 

జూబ్లీ హిల్స్ ఇంచార్జ్ గా కాంగ్రెస్  పార్టీ గెలిస్తే నాకు మంచిపేరు వస్తుందని విమర్శలు చేసున్నారని ఆయన అన్నారు.లక్ష్మణ్ నా పై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదు. లక్ష్మణ్ వచ్చినపుడు నేను వెళ్ళిపోతున్నాను అనటం అబద్ధమని పేర్కొన్నారు. నాకు మంత్రి పదవి పై మోజు లేదని వివేక్ అన్నారు. లక్ష్మణ్ ను రాజకీయంగా ప్రోత్సహించింది వెంకటస్వామి అని మర్చిపోతున్నాడని వాపోయారు.  

కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నాడు.. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదుగా మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదు.. నన్నే ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నన్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజును టార్గెట్ చేసి కొంతమంది సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు.  మా ఇమేజ్, పేరును డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించినా మేము ఎక్కడా వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు.