TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీమకు సిక్కిం తరహా ప్రత్యేక ప్యాకేజీ?

Published on: Mon Oct 8, 2012 3:05PM

 minister tg venkatesh, water projects rayalaseema, ap incharge vayalar ravi, vayalar ravi tg venkateshచిన్న తరహా నీటి ప్రాజెక్టుల మంత్రి టిజి వెంకటేష్‌ కేంద్ర దేశీయవ్యవహారల మంత్రి, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ వాయిలార్‌ రవిని కలిశారు. రాష్ట్రంలో బాగా వెనుక బడిన ప్రాంతంగా రాయలసీమ వుందని ఇదే విషయాన్ని శ్రీకృష్ట కమిటీ కూడా తేల్చిందని ఇందుకు గాను వారు సిక్కిం ప్రభుత్వానికి ఇచ్చిన స్పెషల్‌ ప్యాకేజ్‌ ఇవ్వాలని టిజి వెంకటేష్‌ కోరారు. అలాగే రాయలసీమలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఎక్సైజ్‌ సంకం నుండి మినహాయింపు నివ్వాలని కోరారు. రాయలసీమలో అంతులేని ఖనిజసంపద వుందని దాని ద్వారా పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు. అయితే ఇప్పటివరకు పని చేసిన ప్రభుత్వాలేవీ వ్యవసాయ అభివృద్దికి గాని, మంచినీటి సమస్య కు గాని సరైన పరిష్కారం చూపలేకపోయారని టిజి వెంకటేష్‌ ఆరోపించారు. రాష్ట్ర సమైఖ్యంగా వుంటే తమకు ఏ సమస్యా లేదని ఒక వేళ రాష్ట్రం విడిపోతే మాత్రం రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని, అదే సమయంలో లక్షకోట్లు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసారు. రాయల సీమలోని 4 జిల్లాలయిన కర్నూలు, అనంతపూర్‌, కడప,చిత్తూర్‌ జిల్లాకు ఒక్కోజిల్లాకు 25,000 వేల కోట్లను అభివృద్దికి కెటాయించాలన్నారు. 1953 లో ఆంద్రరాష్ట్రానికి రాజధానిగా వుందని ఆతరువాత పరిణామాల అనంతరం హైదరాబాద్‌ రాజధాని అయ్యిందని దాంతో రాయలసీమ అభివృద్దికి నోచుకోలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చిర్చించి నిర్ణయం తీసుకుంటామని వాయిలార్‌ రవి హామీ ఇచ్చారు.