TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట..8 ఏళ్లనాటి కేసు కొట్టివేత

Published on: Sat May 17, 2025 4:00PM

 

తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదైన కేసును కొట్టిసింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఇది రైతుల విజయమని, చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలపై నమ్మకం బలపడిందని మంత్రి తెలిపారు. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూసేకరణపై ప్రజా విచారణ జరుగుతున్న సమయంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన తాము నిలిచామని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు.

రైతుల హక్కులను కాపాడాలని, వారికి న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే, అప్పటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించింది అని ఆయన వివరించారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగిందని, తాజాగా నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేయడం సంతోషకరమని శ్రీధర్‌బాబు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, పోలీసులను అడ్డగోలుగా వినియోగించుకున్నారని ఆరోపించారు.