విగ్రహాల తయారీలో మంత్రి శ్రీధర్‌బాబు బిజీయా?
Published on: Thu Oct 18, 2012 10:01AM
.png)
రాష్ట్రానికి మంత్రైనా ఓ తల్లికి, తండ్రికి కొడుకే. అలానే ఓ నియోజకవర్గానికి శాసనసభ్యుడే. ఈ రెండు వాక్యాలకు సంబంధించిన వివాదంలో మంత్రి శ్రీధర్‌బాబు ఇరుక్కున్నారు. ఆయన తన తండ్రి విగ్రహాలకు ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గంలో అభివృద్థిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు మిన్నంటుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇంకా బస్సులు తిరగని ప్రాంతాలెన్నో ఉన్నాయన్నది పరిశీలనలో తేలిన అంశం. అలానే నియోజకవర్గంలో అభివృద్థి చెందాల్సిన ప్రాంతాలూ ఎక్కువగానే ఉన్నాయి. ఓ శాసనసభ్యుడనే విషయం మరిచిపోయి మంత్రి శ్రీధర్‌బాబు తన తండ్రి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తే ఎలా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పుట్టా మధు ప్రశ్నిస్తున్నారు. గుక్కెడు నీరు దొరకని పల్లెలను మంత్రి పట్టించుకోవాలని ఆయన కోరుతున్నారు.


