TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శంకర రావుపై దాడి, ఉద్రిక్తం

Published on: Tue Dec 20, 2011 12:57PM

హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావుపై  దాడి జరిగింది. ఎల్బీనగర్ పరిసరాల్లోని ఎన్టీఆర్ నగర్‌లో శంకర రావు కాన్వాయ్ పైన హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి వర్గీయులే దాడి చేసినట్లుగా సమాచారం. మరికొందరు రాళ్లతో దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. శంకర రావే పెద్ద భూకబ్జాదారుడు అంటూ నినాదాలు చేశారు. శంకర రావుకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు మంత్రిని స్థానికంగా ఉన్న ఓ గదిలోకి తీసుకు వెళ్లి భద్రత ఏర్పాటు చేశారు.శంకర రావును తమకు అప్పగించాలని కొందరు రహదారుపై బైఠాయించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కాగా మంత్రి శంకర రావు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక రెడ్డిపై దావా వేసిన జహంగీర్ అనే వ్యక్తిని పరామర్సించేందుకు వెళ్లారు.