సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఖమ్మం మున్సిపాలిటీలో కొత్తగా 20 ఫాగింగ్, స్ప్రేయింగ్ మిషన్లు..
ఒక్కోక్కదాని ఖరీదు 40వేలు..

వానాకాలంలో సీజనల్ గా వచ్చే వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. దోమల నివారణ కోసం ఖమ్మం కార్పొరేషన్ లోని 50 డివిజన్లలో ప్రతి డివిజన్ కు ఫాగింగ్, స్ప్రేయింగ్ మెషిన్లు ఆయన పంపిణీ చేశారు. 20 ఫాగింగ్, స్ప్రేయింగ్ మెషిన్లు పంపిణీ చేశారు. ఒక్కో దాని ఖరీదు రూ.40వేలు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు. ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో ఇంట్లో నిలువ ఉన్న నీరు, మురుగు, చెత్తచెదారంను తొలగించి ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.