TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూన్ 6లోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా : మంత్రి పొంగులేటి

Published on: Thu May 29, 2025 9:26PM

 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు,సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళికా, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వరంగల్ ఎయిర్ పోర్టు అంశాలపై  మంత్రులు, ఎమ్మేల్యేలు, కలెక్టర్లు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పటి వరకు  జిల్లాలో కనీసం 50 శాతం కూడా లబ్ధిదారుల జాబితా ప్రకటించకపోవడం ఏంటి ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితా ఫ్రేమ్ కట్టుకోవడానికి కాదని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి ఆదేశించారు.  నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటి నియంత్రణకు పోలీస్‌, వ్యవసాయ శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. జూన్ 6 కటాఫ్ డేట్‌గా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. పేదల సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే