TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టొబాకో బోర్డు ద్వారా రూ.150 కోట్లు కేటాయించాండి : సీఎం చంద్రబాబు

Published on: Sun Jun 15, 2025 5:17PM

 

ఏపీ పర్యాటనలో భాగంగా అమరాతికి వచ్చిన కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో వివిధ అంశాలపై వారిద్దరూ చర్చించారు.హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు  వినతి పత్రం అందించారు. 

టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్స్ పై జీఎస్టీ తగ్గింపుపై  ప్రధానం చర్చించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు.