TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కబ్జా కాదు హైకోర్టు ఆదేశం తోనే భూమి కొన్నాం: మంత్రి పార్ధసారధి

Published on: Wed May 16, 2012 1:59PM

minister pardhasaradhi, minister pardhasardahi land case, education minister pardhasaradhi land, land deal pardhasaradhi clarification, pardhasaradhi press meet 16 may 2012, jupudi land minister pardhasaradhi, pardhasaradhi land case, pardhasaradhi jupudi land కబ్జా కాదు హైకోర్టు ఆదేశం తోనే భూమి కొన్నాం అని తనపై వచ్చిన భూ కబ్జా తాలూకు ఆరోపణలకు బదులుగా మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి వివరణ ఇచ్చారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో తాను కొనుగోలు చేసిన భూమిని అడ్డం పెట్టుకొని కొందరు బురద చల్లేందుకు చూస్తున్నారని మంత్రి ప్రత్యారోపణ చేసారు.

 

పూర్తి సొమ్ము చెల్లించి నాలుగు ఎకరాలు కొనుగోలు చేశామని, అమ్మకందారు ఇష్టప్రకారమే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గవర్నమెంట్‌ భూమినో..దొంగ భూమినో కొనుగోలు చేయలేదని తాను కొన్న భూమికి అన్ని చట్టపరమైన పత్రాలు ఉన్నాయని మంత్రి పార్థసారధి తెలిపారు. తాను కొన్న భూముల్లో ప్రభుత్వ ఆస్తి ఒక్క సెంట్ కూడా లేదన్నారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకే భూములు కొనుగోలు చేశానని తెలిపారు. తనపై కావాలనే కొందరు బురదజల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. తనపై ఆరోపణలు నిరాధారమన్నారు. భూమి రిజిస్ట్రేషన్ తప్పు అని నిరూపిస్తే భూమి వదులకోడానికి సిద్ధమే అని, అవసరమైతే రాజీనామా చేస్తానని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.