ఎన్టీఆర్ గురించి చెప్పేదేముంది-ఏపీ మంత్రి

 

ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రం ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించడంతో తెల్లవారుజామునుంచే అభిమానుల హడావుడి మొదలైంది. అభిమాన నాయకుడిని తమ అభిమాన హీరోలో చూడ్డానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మంత్రి నారాయణ కూడా ఈ సినిమాను చూశారు.  ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనేంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఎన్టీఆర్ కథను వెండితెరకెక్కించిన బాలయ్యకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.