TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తన ముద్దుల మావయ్య బాలయ్య కొత్త సినిమాకి క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్

Published on: Thu Jun 25, 2026 1:03PM

ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన  నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని,  క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.

బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభోత్సవానికి తాను హాజరు కావడం ఇదే మొదటి సారన్నారు.  ఈ అద్భుత అవకాశం ఇచ్చిన తన ముద్దుల మావయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ.. బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు  ఆలోచన అని చెప్పిన లోకేష్.. ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.  భవిష్యత్ లో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,  దర్శకుడు కొరటాల శివ,  నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు