TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాన్నను జైల్లో చూసి తట్టుకోలేకపోయా : లోకేశ్

Published on: Sun Jul 20, 2025 5:52PM

 

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు  కన్నీళ్లు పెట్టుకున్నట్లు లోకేశ్ తెలిపారు.  జైల్లో నాన్నను చూసి గుండె తరుక్కుపోయిందని ఆయన తెలిపారు. జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ రెండు చోట్లు చంద్రబాబు అని పేరు చూశాను. ఆ కారాగారాన్ని అభివృద్ధి చేసింది. ఆయన ఉన్న భవనాన్ని కట్టించింది నాన్నే. అలాంటి వ్యక్తిని అక్కడ చూసి చాలా బాధవేసిందని లోకేశ్ తెలిపారు.

 ఇంట్లో, ఆఫీస్‌లో తన తండ్రి చంద్రబాబును ఎలా పిలుస్తారనే విషయంపై స్పందించారు. "కింద ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా బాస్. పై ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా నాన్న. రాజకీయాలు ఇంట్లోకి రావు, ఆఫీస్‌లోకి పర్సనల్ మేటర్స్ రావు. అవి మేము గీసుకున్న కచ్చితమైన హద్దులు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను నాన్నా అని పిలుస్తాను. తన కెరీర్ లో తల్లి నారా భువనేశ్వరి పాత్రను కూడా ప్రస్తావించారు. "మా అమ్మ నా పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. 

నా ఎదుగుదల కోసం అన్ని రకాలుగా త్యాగం చేసింది. నా చదువు, కెరీర్ మరియు ఇతర అంశాల్లో నాకు మార్గదర్శనం చేసింది" అని వివరించారు. ఇక తమ కుటుంబ వ్యాపారంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ చెప్పారు. అప్పటినుంచి ఫుల్ టైమ్ రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని తెలిపారు.