TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేశ్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు

Published on: Thu Apr 16, 2026 5:38PM

 

టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన మంత్రి నారా లోకేశ్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేశ్‌.. నూతన బాధ్యతల్లో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. నారా లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత శక్తిమంతంగా ముందుకు సాగాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని పవన్ కల్యాణ్ కోరుకున్నారు. 

ఇప్పటికే తన శాఖల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన, పార్టీని కూడా అదే స్థాయిలో బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ లోకేశ్ తన సమర్థతను చాటుకుంటారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని పవన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ  ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకూ పవన్‌ అభినందనలు తెలియజేశారు.