లెటర్ హెడ్.. అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి

 

తెలంగాణ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు. కీలక అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ లెటర్ హెడ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ అడ్డంగా దొరికిపోయారు. పార్టీ లెటర్ హెడ్ పై ఇవ్వాల్సిన అపాయింట్ మెంట్ లెటర్ కాస్త ప్రభుత్వ లెటర్ హెడ్ పై ఇచ్చి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఆయన మంత్రిత్వ శాఖకు చెందిన లెటర్ హెడ్ పై కీసర మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా జలపురం సుధాకర్ రెడ్డిని నియమిస్తూ అపాయింట్ మెంట్ లెటర్ జారీ చేశారు. దీంతో.. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వాడాల్సిన లెటర్ హెడ్ ను పార్టీ వ్యవహారాలకు వినియోగించడం ఏంటంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లెటర్ హెడ్ కదా ఎవరూ పట్టించుకోరులే అనుకుంటున్నారో ఏమో కానీ దాని వాల్యూ వేరు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.