TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాన్వాయ్‌ని సగానికి తగ్గించిన మంత్రి లోకేశ్

Published on: Thu May 14, 2026 10:02AM

 

ప్రధాని మోదీ పిలుపు మేరకు మంత్రి నారా లోకేశ్‌ తన కాన్వాయ్‌కు సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. దీంతో లోకేశ్‌ కాన్వాయ్‌ 2 వాహనాలకే పరిమితం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతలో ఉన్న లోకేశ్‌కు నిబంధనల ప్రకారం తగినన్ని వాహనాలు ఉండాలి. అయినా, తన కాన్వాయ్‌ని కుదించాలని  ఆదేశించారు. లోకేశ్ ప్రస్తుతం సీఆర్‌పీఎప్ రాష్ట్ర ప్రభుత్వ జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారు. తన కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను విజ్ఞప్తి  చేశారు 

సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకునేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు.  ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా బాబు, పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.   తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. పొదుపు చర్యలలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ తన వాహన శ్రేణిని కుదించాలని ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్, లోకేశ్‌ లు అదే దారిని ఎంచుకోవడం గమనార్హం.