TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి పై కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

Published on: Tue Aug 25, 2020 4:54PM

ఏపీ రాజధాని అమరావతి పై ఏపీలో తీవ్రమైన రచ్చ జరుగుతున్న సంగతి తెసిందే. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని అమరావతి విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. పేదలు ఉండడానికి వీల్లేని అమరావతిలో చట్టసభలు నిర్మించడం, నిర్వహించడం కూడా కుదరదని కొడాలి నాని అన్నారు. నేను వైఎస్ జగన్ ను కూడా కోరబోతున్నాను. హైకోర్టు కూడా పేదలు ఉండడానికి వీల్లేదని చెబితే కనుక అక్కడ రాజధాని నిర్మించడానికి కూడా వీల్లేదు అని అన్నారు.

 

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచాలని జగన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయితే దీనిపై అమరావతి జెఏసి కోర్టు మెట్లెక్కింది. దీంతో హైకోర్టు ఈ ఉత్తర్వుల పై స్టే విధించింది.