ఇంత అహంకారమా జగదీశ్ రెడ్డి జెండా ఆవిష్కరణ ఎలా చేశారంటే..?
Published on: Thu Jun 2, 2022 2:20PM
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సాక్షిగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఆ అవమానం చేసింది సాక్షాత్తూ మంత్రి జగదీశ్వరరెడ్డి. జాతీయ జెండా ఆవిష్కరించే సమయంలో షూ తీయాలన్న నిబంధన ఉంది.
అయితే మంత్రి జగదీవ్ రెడ్డి దానికి ఉల్లంఘించారు. షూ ధరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా పట్ల ఇంతటి అగౌరవమా? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి అహంకారానికి ఇది నిదర్శనంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
జగదీశ్ రెడ్డి జెండా ఆవిష్కరణ సమయంలో తెలంగాణ మలిదశ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ సర్ ను కూడా అవమానించారని చెబుతున్నారు. ఆయన చిత్ర పటాన్ని వేదిక కింద పెట్టి ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించడాన్ని తప్పుపడుతున్నారు.



