ఆపన్న హస్తం చాచుదాం..! కరోనాను త‌రిమేద్దాం!

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నిరుపేద‌ల్ని ఆదుకోవ‌డానికి ఆర్థిక‌స‌హాయం చేయాల‌ని తెలంగాణా రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. 
కరోనా ప్రభావంతో నిరుపేదల జీవనమే కష్టతరంగా మారింద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ పరిస్థితులలో మీకు మీమున్నామంటూ పలువురు మానవతా మూర్తుల చేస్తున్న సాయం సర్వత్రా ప్రశంశలు పొందుతున్నదని ఆయ‌న అన్నారు. ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారని., ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్ధిపేటకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త దుండిగల బాల్ రాజేశం రూ.5లక్షలు, జువ్వన మల్లేశం రూ.1లక్ష రూపాయలు, మాధవనేని రామారావు రూ.1లక్ష రూపాయలు, మాజీ ఏఏంసీ చైర్మన్ వేముల వెంకట్ రెడ్డి రూ.1లక్ష రూపాయలు, చిన్నకోడూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ తరపున రూ.10వేలు విరాళాలు ప్రకటించారు.