కియా మోటార్స్ ఏపీ పాలిట గుదిబండ: ఏపీ మంత్రి

 

కియా మోటార్స్ పై కొందరు వైసీపీ నేతలు గరంగరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అది చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీ అనో ఏమో కానీ వైసీపీ నేతలు పబ్లిక్ గానే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కియా తొలి కారు లాంచ్ సందర్భంగా హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం జగన్ కూడా ఎంపీ గోరంట్లపై సీరియస్ అయ్యారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి కియా మోటార్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కియా ఏపీ పాలిట గుదిబండ అని, ఈ ఒక్క కంపెనీకి ఇచ్చే రాయితీల వల్ల రాష్ట్రంపై 20 సంవత్సరాలలో 20 వేల కోట్ల భారం పడుతుందని వ్యాఖ్యానించారు. కియాకు ఇచ్చిన ప్రోత్సాహకాలలో పదవ వంతు కూడా ఇవ్వకుండా 2012-13లో ఇసుజి వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో ఇచ్చిన ప్రోత్సాహకాలను సమీక్షించాల్సి ఉందని గౌతమ్ రెడ్డి అన్నారు.