TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మద్యం కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుంటుంది : మంత్రి గొట్టిపాటి

Published on: Mon Jul 21, 2025 3:30PM

 

గత వైసీపీ ప్రభుత్వానికి ఉన్నంత ప్రచార పిచ్చి కూటమి ప్రభుత్వాన్నికి లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువులన్నీ మంచి నాణ్యతతో ఇచ్చాం. రాజకీయ నాయకుల ఫొటోలు వేయకుండా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.’’ అని గొట్టిపాటి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం కింద రూ. 10 వేల కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 

జగన్ హయాంలో నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన అందరికీ శిక్ష పడుతుందని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో చట్టం తన పని తాను చేస్తోందని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.‘‘రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించబోమని గతంలో చెప్పాం. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు. ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని ఆయన తెలిపారు.