TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రహ్మనందం ప్రచారంతొ మంత్రిగారు ఓటమి 

Published on: Sat May 13, 2023 4:35PM

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మనందం మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన బీజేపీ నేత, కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుదాకర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఆయన ఓడిపోయారు. చిక్‌బళ్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన సుధాకర్‌కు బ్రహ్మనందం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో 11, 130 ఓట్ల తేడాతో సుధారక్ ఓటమ చవి చూడాల్సి వచ్చింది. సుధాకర్ గెలుపు కోసం బ్రహ్మనందం నాలుగు రోజుల పాటు.. చిక్‌బళ్లాపూర్‌లో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో తెలుగు ప్రజల శాతం అత్యధికంగా ఉంటుంద విషయం విదితమే. 

అయితే తన ప్రచారంలో బ్రహ్మనందం తాను నటించిన సినిమాల్లోని డైలాగ్‌లు పేల్చి.. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు మాత్రం ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతో లేకుంటే కాంగ్రెస్ పార్టీపై ఉన్న మక్కువతోనో.. కానీ హస్తం పార్టీకి గంపగుత్తుగా ఓట్లు గుద్దిపడేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఇక 2019లో జరిగిన చిక్ బళ్లాపూర్ ఉప ఎన్నికల్లో సైతం సుధాకర్‌కు బ్రహ్మనందం ప్రచారం చేయడంతో.. నాడు ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అయిందన్న సంగతి తెలిసిందే.