సింహాచలం దుర్ఘటనపై క్షుద్ర రాజకీయాలా.. జగన్ తీరును తప్పుపట్టిన మంత్రి ఆనం
Published on: Thu May 1, 2025 1:16PM
.webp)
ప్రకృతి వైపరీత్యంతో సింహాచలం దేవస్థానం వద్ద జరిగిన దురదృష్ట సంఘటనను రాజకీయం చేయాలన్న వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ తన రాజకీయ లబ్ధి కోసం ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించిన మరణాలను వాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ నాయకులు, ప్రజలూ కూడా తప్పుపడుతున్నారు. అందులో భాగంగానే జగన్ తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుకోని విపత్తులో కుటుంబ సభ్యులను కోల్పోయి బాధపడుతున్న జగన్ మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. గత ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించి జగన్ కు జనం బుద్ధి చెప్పినా ఆయన మారలేదని ఆనం అన్నారు.
అనూహ్య సంఘటన కారణంగా మరణించిన వారి కుటుంబాలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాతిక లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిందనీ, అలాగే క్షతగాత్రులకు మూడు లక్షల రూపాయలు పరిహారం అందిస్తున్నదని చెప్పారు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈర్థిక సాయం ప్రకటించిందని గుర్తు చేశారు. సింహాచలం దుర్ఘటన బాధితులను అదుకునే విషయంలో ప్రభఉత్వం నిబద్ధతతో ఉందని ఆనం అన్నారు.
అన్నమయ్య డ్యాము తెగిపోయి 33 మంది చనిపోయిన సందర్భంలో కూడా స్పందించని జగన్, కడప నుండి విశాఖపట్నం వచ్చి ఈ సింహాచలనం సంఘటనపై అర్థంపర్థం లేని విధంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆనం చెప్పారు. శవరాజకీయలతో లబ్ధిని పొందేందుకు ప్రయత్నించడం సరైన విధానం కాదంటూ హితవు పలికారు.


