TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆయన బ్రదర్ అనిల్ కి బందువుట!

Published on: Wed Jun 10, 2015 5:40PM

 

ఆంద్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు ఈరోజు సరికొత్త విషయం ఒకటి బయటపెట్టారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ స్టీఫెన్ సన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కి బంధువు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ కుట్రలో జగన్మోహన్ రెడ్డి కూడా తోడ్పడినట్లు మాకు అనుమానాలున్నాయి. అందుకే కేసీఆర్ కి మద్దతుగా జగన్ మాట్లాడుతునట్లున్నారు,” అని ఆరోపించారు.

 

“కేవలం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల ఫోన్లు మాత్రమే కాకుండా తెలంగాణాలో తెదేపా ముఖ్యనేతలందరి ఫోన్లు కూడా తెలంగాణా ప్రభుత్వం ట్యాప్ చేసి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఏదయినా హాని తలపెడితే ఆయన అంతకు పదింతలు చెల్లించుకోవలసివస్తుందని హెచ్చరిస్తున్నాము,” అని అన్నారు.

 

అచ్చెం నాయుడు ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ ఈ కుట్రలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొని ఉన్నట్లు రుజువయితే దాని వలన అందరి కంటే ఎక్కువ నష్టపోయేది వైకాపాయే. ప్రజలెన్నుకొన్న తెదేపా ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, మళ్ళీ త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయని...ఆయన ఇదివరకు చాలాసార్లు అన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నేతలు ఆవిధంగా మాట్లాడటం సహజమేనని ఎవరూ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆరోజు ఏదో కాకతాళీయంగా చెప్పిన మాటలు కావని అర్ధం అవుతోంది. తెదేపా ప్రభుత్వం కూల్చివేసేందుకు తెర వెనుక చాలా కాలంగా కుట్రలు జరుగుతున్నాయని ఇప్పుడు అర్ధమవుతోంది. అయితే దేశముదురు రాజకీయ నేతలమని గొప్పలు చెప్పుకొనే తెదేపా నేతలు దీనిని గ్రహించలేకపోవడమే విడ్డూరం. కనీసం ఇప్పటికయినా మేల్కొనకపోతే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏమీ ప్రయోజనం ఉండదు.