TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ దీక్ష:న్యాయం జరిగే వరకూ పోరాడుతానని ప్రతిజ్ఞ

Published on: Wed Jan 11, 2012 8:36AM

నిజామాబాద్: ఏ రాష్ట్రంలోనైనా చూడండి ప్రతి మనిషికి అన్నాన్ని పెట్టే అన్నదాత సమస్యలను తీర్చేందుకు వ్యవసాయ మంత్రి ఉంటాడు. అతనే అన్నీ తానై చూసుకుంటాడు. అటువంటిది మన రాష్ట్రంలో వ్యవసాయ మంత్రి లేని దౌర్భాగ్యం దాపురించిందని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.తాము ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన అన్నారు. రైతు, పేద వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తోందని జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు ముఖాన చిరునవ్వులు ఉండేవన్నారు. ఈనాడు అటువంటి పరిస్థితి లేదన్నారు. పంట నష్టపోయిన రైతులు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి శోకంలో ఉన్నారని చెప్పుకొచ్చారు.తనను ఎన్ని ఇబ్బందులగు గురి చేసినా రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని ప్రతిజ్ఞ చేశారు. తన దీక్షను అడ్డుకునేందుకు ఎంతమంది ప్రయత్నించినా నిజామాబాద్ ఆర్మూర్ ప్రజలు విజయవంతంగా తన దీక్షా శిబిరానికి తీసుకవచ్చారని అన్నారు.  గత రెండేళ్లుగా ఎన్ని దీక్షులు చేస్తున్నా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్సించారు. వైయస్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన దీక్షను ప్రారంభించారు.

రైతులను పట్టించుకోకపోతే చరిత్రహీనుడివైతావని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారని శాసనసభ్యురాలు కొండా సురేఖ అంతకు ముందు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి రైతులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి భరోసా ఇచ్చారని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వైయస్ జగన్ దీక్షా శిబిరంలో ఆమె  ప్రసంగించారు. వైయస్ మరణించగానే రైతుల పరిస్థితి మారిపోయిందని, వైయస్ పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని ఆమె అన్నారు. ఎన్ని ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదురైనా రైతులకు అండగా నిలుస్తానని వైయస్ జగన్ దీక్ష చేపట్టారని ఆమె అన్నారు. అడ్డుకోవడానికి ఎంత మంది ప్రయత్నించారని, అయినా ప్రజలు ఆదరించి దీక్షలో కూర్చోబెట్టారని ఆమె అన్నారు.జగన్ స్వార్థం కోసం దీక్ష చేపట్టలేదని ఆమె అన్నారు. దీక్షను విజయవంతం చేసి ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపి ప్రభుత్వం కళ్లు తెరిచేలా చూడాలని ఆమె అన్నారు.  జగన్ సమక్షంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు కేసుపల్లి గంగారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.