TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మినీబస్సు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Published on: Wed Sep 17, 2014 11:33AM

 

హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ సమీపంలో వున్న సినిమా పరిశ్రమ కేంద్రీకృతమైన ప్రాంతం కృష్ణానగర్‌లో ఓ మినీ బస్సు అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకువెళ్లింది. ఈ సంఘటనలో ముగ్గురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించి క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు, 5 బైకులు ధ్వంసమైనాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మినీ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.