గనుల శాఖ ఘనుడు వెంకటరెడ్డి అరెస్టు!
Published on: Fri Sep 27, 2024 12:34PM

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డిని ఏసీబీ అధికారులు అరెైస్టు చేశారు. నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు. గత వైసీపీ ప్రభుత్వ హయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది. అప్పటి నుంచీ పరారీలో ఉన్న వెంకటరెడ్డిని ఏసీపీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆయనను ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నారు. వెంటకరెడ్డితో పాటు రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన మూడు సంస్థలపై కూడా ఏసీబీ కేసులు నమోదు చేసింది.


