మోడీ చిత్రపటానికి పాలాభిషేకాలు
Published on: Wed May 7, 2025 5:20PM

పహల్గాం దాడికి తగిన బదులు తీర్చుకున్నామనీ, ఉగ్ర ముష్కరులకు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
పహల్గాం దాడి అనంతరం భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేర పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తో విరుచుకుపడి 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యప్తంగా బీజేపీ సంబరాలు చేసుకుంటోంది, పలు చోట్ల మోడీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు, నేతలు పాలాభిషేకం చేశారు.


