TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగ్లాదేశ్ లో సైనిక పాలన!?

Published on: Mon Aug 5, 2024 4:07PM

బంగ్లాదేశ్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. ఆమె ప్రత్యేక విమానంలో భారత్ కు చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు దేశాన్ని దగ్ధం చేస్తోంది.

ఆ దేశ పౌర సమాజం రెండుగా చీలిపోయి వీధుల్లోకి వచ్చి ఘర్షణలకు దిగుతోంది. ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి ప్రవేశించారు. సైన్యం వారిని అడ్డుకునే ప్రయత్నంలో టియర్ గ్యాస్ ప్రయోగించింది. కాగా తాజాగా బంగ్లాదేశ్ లో ప్రజ్వరిల్లిన హింసాకాండలో వంద మందికి పైగా మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు.

ఇలా ఉండగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రత్యేక హెలికాప్టర్ లో భారత్ కు చేరుకున్నట్లు విశ్వసనీ సమాచారం. షేక్ హసీనా రాజీనామాతో సైన్యం పరిస్థితులను తన అధీనంలోకి తీసుకుంది.