TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మిడ్‌నైట్ రన్నర్ ప్రదీప్‌కు ఫుల్ పాపులారిటీ.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

Published on: Wed Mar 23, 2022 5:00PM

కాదేదీ కవిత కనర్హం, అన్నారు మహా కవి శ్రీ శ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్ల... సబ్బుబిళ్ళ అంటూ, దానికో జాబితాను జోడించారు..చివరగా  హీనంగా చూడకు దేన్నీ... కవితామాయయేనోయ్ అన్నీ, అంటూ ముక్తాయింపు నిచ్చారు మహా కవి. అదేమో కానీ, ప్రస్తుత వ్యాపార ప్రపచంలో, కార్యకారణ సంబంధాలతో సంబంధమ లేకుండా, ఎక్కడో జరిగిన ఏ సంఘటన అయినా, ప్రచార వస్తువుగా ఒదిగి పోతోంది. కాదు, క్రియేటివ్ బ్రైన్స్’ ఆ విధంగా అన్నిటినీ ఉపయోగించుకుంటున్నారు. అది యుద్దమే అయినా, ఎన్నికల విజయమే అయినా, పొలిటికల్ కామెంటరీనే ఆయినా, వ్యాఖ్య, విమర్శ  అది ఏదైనా కమర్షియల్’  వరల్డ్ దాన్ని, ప్రకటన (యాడ్)గా చేసుకుని ‘క్యాష్’ చేసుకోవడం సర్వ సాధారణం అయిపొయింది. అలాగే, ఈమధ్య కాలంలో ప్రభుత్వ సంస్థలు కూడా, అదే బాటలో నడుస్తున్నాయి. 

ఇక విషయంలోకి వస్తే  మిడ్‌నైట్ రన్నర్‌గా ఒక్కసారిగా ఫేమస్ అయిన నోయిడా కుర్రాడు ప్రదీప్ మెహ్రాకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి  ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మొదలుకొని, చాలామంది సెలబ్రిటీలు ప్రదీప్‌ను అభినందిస్తున్నారు. 

అదలా ఉంటే, ఒక్కసారిగా వచ్చిపడిన ప్రాచుర్యంతో ప్రదీప్ ఇప్పుడు సోషల్ మీడియాలో  మీమ్ మెటీరియల్‌గా మారాడు. ప్రదీప్ ఇమేజెస్‌తో అనేక మీమ్స్, జిఫ్స్ కూడా రూపొందుతున్నాయి. తాజాగా ప్రదీప్ పాపులారిటీని పోలీసులు కూడా వాడుకుంటున్నారు. పూణే పోలీసులు ప్రదీప్ ఇమేజ్‌తో ఒక ప్రకటన తయారు చేశారు. ప్రదీప్ పరుగెడుతున్న చిత్రాన్ని ఉపయోగించి, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. 

‘‘టెలికాలర్స్ ఫోన్ చేసి ఓటీపీ అడిగినప్పుడు ప్రదీప్ లాగే వాళ్లకు చిక్కకూడదు’’ అని చెప్పేలా ఒక ప్రకటన రిలీజ్ చేశారు.అంటే వినోద్ కాప్రి లిఫ్ట్ ఇస్తానన్నప్పటికీ, ఆ ఆఫర్‌ను కాదని ప్రదీప్ ఎలా వెళ్లాడో.. అలాగే ఏదైనా ఆఫర్ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే కూడా వాళ్లకు చెప్పకుండా తప్పించుకోవాలి అని అర్థం వచ్చేలా ఈ యాడ్ తయారు చేశారు పోలీసులు. 

అదలా ఉంటే అనుకోకుండా,ఆశించకుండా ఒకే ఒక్క వీడియో ద్వారా వచ్చిన గుర్తింపు ర్తింపు, ప్రదీప్ మెహ్రాకు చాలావరకు మేలే చేసింది.ఆ వీడియోలో ప్రదీప్‌ చూపిన దీక్ష, పట్టుదల పెద్దలను మెప్పించింది. అనేక మంది ఆ పిల్లాడికి  సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. అతడు ఆర్మీలో చేరేందుకు అవసరమైన శిక్షణ అందించేందుకు, తన తల్లికి చికిత్స అందించేందుకు సాయపడతామని పలువురు ప్రకటించారు. 

అయితే నాణ్యాని రెండో వైపులా, ఒక్కసారిగా వచ్చి పడిన  పాపులారిటీని ప్రదీప్’ కు కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టింది.ఆ విషయం ప్రదీప్’ స్వయంగా షేర్ చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడికి వెళ్లినా అందరూ సెల్ఫీలు అడుగుతున్నారని, పనికి వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పాడు. మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు అడుగుతున్నాయని, ఈ పాపులారిటీ వల్ల తన ప్రాక్టీస్‌కు ఆటంకం కలుగుతుందని ప్రదీప్ వాపోతున్నాడు. అయితే, తన లక్ష్యం మాత్రం అదేనని, సైన్యంలో చేరాలన్నదే తన ఆకాంక్షని ప్రదీప్ చెప్పుకొచ్చారు.