విజయవాడ రైల్వేస్టేషన్ దగ్గర ఉద్రిక్తత
Published on: Mon Aug 6, 2018 11:38AM

తమ సమస్యలను పరిష్కరించాలంటూ మధ్యాహ్నభోజన కార్మికులు 'ఛలో విజయవాడ' పేరుతో పిలుపునిచ్చారు.. దీంతో 13 జిల్లాల నుండి మధ్యాహ్నభోజన కార్మికులు భారీ సంఖ్యలో రైళ్లలో విజయవాడ చేరుకున్నారు.. పోలీసులు కూడా భారీగా మోహరించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది.. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.


