TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సమ్మె కాలంలో మెట్రోరైల్ సేవల పెంపు

Published on: Wed Apr 22, 2026 1:20PM

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మెట్రో రైళ్ల రాకపోకల  సంఖ్యను సాధ్యమైనంత గరిష్ట స్థాయికి పెంచాలని నిర్ణయించింది.ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ పౌరులకు అసౌకర్యాన్ని తగ్గించే ఉద్దేశంతో మెట్రో రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు.

సమ్మె కాలంలో   రద్దీ సమయాల్లోనూ (  రద్దీ లేని సమయాల్లోనూ   కలిపి మొత్తం 56 రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు.   ఆర్టీసీ  సమ్మె దృష్ట్యా..  రోజంతా గరిష్ట సంఖ్యలో  56  రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు.  అలాగే..  ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు,  చివరి మెట్రో రైలు సర్వీసును రాత్రి 11:00 గంటల తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.