TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెట్రో రైల్ ఉద్యోగుల మెరుపు సమ్మె

Published on: Tue Jan 3, 2023 10:11AM

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో మెట్రో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వేతనాలు పెంచాలంటూ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో టికెట్ ఇస్యూయింగ్ వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది.  మెట్రో స్టేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీసం భోజనం చేయడానికి కూడా బ్రేక్ దొరకదని, రిలీవర్స్ రాక తామ తీవ్ర ఒత్తిడిలో ఉద్యోగం చేయాల్సిన దుస్థితిలో ఉన్నట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు.

తమకు కనీసం సెలవులు కూడా మంజూరు చేయటం లేదని ఆరోపిస్తున్నారు.  మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో స్టేషన్ లలో టికెటింగ్  వ్యవస్థ స్తంభించిపోయింది. మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరణతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. 

కాగా ఉద్యోగులు అయితే గత ఐదేళ్లుగా జీతాలు పెంచ,ఐదు సంవత్సరాలుగా 11 వేల రూపాయల వేతనంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. తక్షణమే తమ వేతనాలను .  18 వేలకు  పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు.