TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

30 నిమిషాల్లో నాగోల్ టు జూబ్లీహిల్స్ ! గుండె తరలింపునకు మెట్రో గ్రీన్ చానెల్ 

Published on: Tue Feb 2, 2021 3:00PM

హైదరాబాద్‌ మెట్రోలో  కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గుండె మార్పిడి కోసం ఫస్ట్ టైమ్ ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి.. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మెట్రోలో గుండెను తరలించారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఇదేక్రమంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు తరలించారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో శస్త్ర చికిత్స జరిగింది.  

ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌కు గుండెను తరలించి.. అక్కడి నుంచి మెట్రోలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు నాన్ స్టాప్‌గా నడిపారు.  30 నిమిషాల్లోపే మెట్రోలో నాగోలు నుంచి జూబ్లీ హిల్స్  చెక్ పోస్టుకు చేరింది గుండె. దీనికి సంబంధించి ముందే సమాచారం అందడంతో మెట్రో అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధమయ్యారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉన్నందున.. రోడ్డుమార్గంలో అంబులెన్స్‌లో గుండెను తరలిస్తే లేట్ అవుతుందని, మెట్రోలో గుండెను తరలించారు.