TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్లుండి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు

Published on: Thu May 15, 2025 8:29PM

 

 

హైదరాబాద్ మెట్రో చార్జీలు ఎల్లుండి నుంచి ఛార్జీలు పెరగనున్నాయి. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. సవరించిన నూతన ఛార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10 ఉండగా, దానిని రూ.12కి పెంచారు. అదేవిధంగా, గరిష్ఠ ప్రయాణ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెరగనుంది. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఛార్జీల శ్లాబులను సవరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పెరిగిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి. 

పెరిగిన ఛార్జీల వివరాలు

    మొదటి రెండు స్టాప్‌లకు రూ.12
    రెండు నుంచి 4 స్టాప్‌ల వరకు రూ.18
    4 నుంచి 6 స్టాప్‌ల వరకు రూ.30
    6 నుంచి 9 స్టాప్‌ల వరకు రూ.40
    9 నుంచి 12 స్టాప్‌ల వరకు రూ.50
    12 నుంచి 15 స్టాప్‌ల వరకు రూ.55
    15 నుంచి 18 స్టాప్‌ల వరకు రూ.60
    18 నుంచి 21 స్టాప్‌ల వరకు రూ.66
    21 నుంచి 24 స్టాప్‌ల వరకు రూ.70
    24 స్టాప్‌లు.. ఆపైన రూ.75